ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

MEETING WITH CM JAGAN: సీఎంతో సజ్జల, బుగ్గన భేటీ.. ఉద్యోగుల సమస్యలపై చర్చ - పీఆర్సీ తాజా వార్తలు

MEETING WITH CM JAGAN: ఉద్యోగ సంఘాలతో నిన్న జరిగిన చర్చల సారాంశాన్ని వివరించేందుకు సీఎంతో.. సజ్జల, బుగ్గన భేటీ అయ్యారు. పీఆర్సీపై చర్చలు రేపటికి పూర్తి కావచ్చని ప్రభుత్వ సలహాదారు సజ్జల తెలిపారు.

MEETING WITH CM JAGAN
MEETING WITH CM JAGAN

By

Published : Dec 16, 2021, 3:14 PM IST

Updated : Dec 16, 2021, 6:55 PM IST

MEETING WITH CM JAGAN ON PRC: సీఎంతో సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థికమంత్రి బుగ్గన భేటీ ముగిసింది. ఉద్యోగ సంఘాలతో నిన్న జరిగిన చర్చల వివరాలను సజ్జల, బుగ్గన ముఖ్యమంత్రికి వివరించారు. ఉద్యోగులకు ఎంతమేర పీఆర్సీ ఇవ్వాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు.

ప్రస్తుతం ఉద్యోగులకు 27శాతం ఐఆర్ ఇస్తున్నామని.. ఈ నేపథ్యంలో ఉద్యోగుల వేతనం తగ్గకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల వివరించారు. ఉద్యోగుల మిగిలిన డిమాండ్ల పరిష్కారంపైనా సీఎం జగన్ తో చర్చించినట్లు వివరించారు. సీఎస్‌ కమిటీ సిఫార్సు చేసిన 14.29 ఫిట్‌మెంట్‌ అమలుచేస్తూ.. ఐఆర్‌కు రక్షణ కల్పించనున్నట్లు స్పష్టం చేశారు.

ఉద్యోగులతో సీఎస్, ఆర్థికశాఖ మంత్రి ఇవాళ మరోసారి చర్చిస్తారని.. సీఎంతో ఉద్యోగ సంఘాల సమావేశం ఉండబోదని సజ్జల పేర్కొన్నారు. పీఆర్సీపై చర్చల ప్రక్రియ రేపటికి పూర్తికావచ్చని సజ్జల అభిప్రాయపడ్డారు. రేపు లేదా సోమవారం సీఎంతో ఉద్యోగ సంఘాల చర్చలు ఉండొచ్చని.. నేతలు సీఎంను కలిశాకే పీఆర్సీపై ప్రకటన ఉంటుందని సజ్జల తెలిపారు.

ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు వాయిదా..
ప్రభుత్వం పీఆర్సీపై ఇవాళ ఉద్యోగ సంఘాలతో జరపవలసిన చర్చలు మధ్యలోనే వాయిదా పడ్డాయి. సీఎంతో అత్యవసర భేటీ దృష్ట్యా సీఎస్‌ సమీర్‌ వెళ్లిపోవడంతో.. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ చర్చలు వాయిదా పడ్డాయి.

ఇదీ చదవండి:

Lokesh Tweet: 'దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వీరులకు జోహార్లు'

Last Updated : Dec 16, 2021, 6:55 PM IST

ABOUT THE AUTHOR

...view details