ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 23, 2020, 5:51 PM IST

Updated : Oct 23, 2020, 7:03 PM IST

ETV Bharat / city

పోలవరం ఖర్చు పరిమితం చేయాలని చంద్రబాబే లేఖ రాశారు: బుగ్గన

పోలవరం పునరావాసం, భూసేకరణ ఖర్చు కేంద్రానిదే అని చట్టంలో ఉందని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమైన ఆయన... పోలవరానికి రాష్ట్రం చేసిన ఖర్చును ఇవ్వాలని కోరారు.

పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రానిదే
పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రానిదే

పోలవరాన్ని పూర్తిగా తామే నిర్మిస్తామని విభజన చట్టంలో కేంద్రం చెప్పిందని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమైన ఆయన... పోలవరం ప్రాజెక్టు వ్యయ ప్రతిపాదనలపై చర్చించారు. పోలవరం పునరావాసం, భూసేకరణ ఖర్చు కేంద్రానిదే అని చట్టంలో ఉందని గుర్తుచేశారు. కేంద్రం చేపట్టాల్సిన పోలవరాన్ని రాష్ట్రం తీసుకుందని వివరించారు.

పోలవరానికి 2014 నాటి ఖర్చు ఇవ్వాలని గత ప్రభుత్వం తీర్మానం చేసిందని.. ఖర్చును పరిమితం చేయాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని ఆరోపించారు. ప్రాజెక్టు విషయంలో తెదేపా ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. కాంట్రాక్టు పనులపైనే తెదేపా ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆరోపించారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీకి ఆమోదం తెలిపారన్నారు. ఇప్పటికే పూర్తి కావాల్సిన ప్రాజెక్టును...నిర్మించలేకపోయారన్నారు. అర్ధరాత్రి ఒప్పందాలు చేసుకుని రాష్ట్రానికి ఇబ్బంది కలిగించే నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు. మేం అధికారంలోకి వచ్చాక అంచనాలు సవరించటంతో బండారం బయటపడిందన్నారు. పోలవరం నిర్మాణంలో రాష్ట్రానిది నిర్మాణ పర్యవేక్షణ మాత్రమేనన్నారు. ప్రాజెక్టు అథారిటీ ఖరారు చేసిన మొత్తాన్ని విడుదల చేయాలని కోరామన్నారు. పోలవరానికి రాష్ట్రం ఖర్చు చేసిన రూ.4 వేల కోట్లకుపైగా నిధులు కేంద్రం నుంచి రావాలన్నారు.

జలవనరులశాఖ, ప్రాజెక్టు అథారిటీ, కేంద్రం చర్చించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని బుగ్గన కోరారు. 90 శాతం రాష్ట్ర ప్రజలు రాష్ట్ర విభజన కోరుకోలేదన్నారు. విభజన వల్ల రాజధాని, పరిశ్రమలు, ఆదాయం అన్ని కోల్పోవాల్సి వచ్చిందని...వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉన్న ఏపీని ఆదుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రాన్ని కోరారు. పోలవరానికి రాష్ట్రం ఖర్చు చేసిన రూ.4 వేల కోట్లకుపైగా నిధులు కేంద్రం నుంచి రావాలన్నారు. నిధులు వెంటనే ఇవ్వాలని కేంద్ర ఆర్ధిక మంత్రికి విజ్ఞప్తి చేశామని బుగ్గన తెలిపారు. సమస్యను అధిగమించేందుకు తదుపరి కార్యాచరణపై సీఎం జగన్​తో చర్చించి ఓ సమగ్ర ప్రణాళికతో ముందుకు వస్తామని వెల్లడించారు.

పోలవరం ఖర్చు పరిమితం చేయాలని చంద్రబాబే లేఖ రాశారు

ఇదీచదవండి

'కరోనా తిరగబెట్టొచ్చు అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేం'

Last Updated : Oct 23, 2020, 7:03 PM IST

ABOUT THE AUTHOR

...view details