Budha venkanna fires on YSRCP: సీఎం జగన్ దొంగలకు మంత్రి పదవులు ఇచ్చారని తెదేపా నేత బుద్దా వెంకన్న విమర్శించారు. మూడేళ్లలో మంత్రిగా వెలంపల్లి రూ.1525కోట్లు అవినీతికి పాల్పడ్డారంటూ ఓ నివేదిక విడుదల చేశారు. జే గ్యాంగ్ అవినీతి భాగోతం అంటూ ఓ చిట్టా విడుదల చేశారు. దేవాదాయ ఆడిట్లో అక్రమాలు, ఎన్ఓసీ మంజూరులో చేతివాటం, దుర్గ గుడిలో టిక్కెట్ల అమ్మకం మొదలు టెండర్ల వరకు అంతా భారీ అవినీతే అని జాబితాలో పేర్కొన్నారు. గుడిని.. గుడిలో లింగాన్ని దోచే వెల్లంపల్లి శ్రీనివాస్‌ను దేవదాయ శాఖ మంత్రిగా చేశారని మండిపడ్డారు.
Budha Venkanna: మంత్రి వెల్లంపల్లి దోచుకున్న రూ.1,525 కోట్ల సంగతేంటి?: బుద్దా వెంకన్న - తెదేపా నేత బుద్ధా వెంకన్న వార్తలు
Budha venkanna fires on YSRCP: ఒకే జాతి పక్షులన్నింటినీ ఒకే గూటికి చేర్చినట్లు.. సీఎం జగన్ దొంగలకు మంత్రి పదవులు ఇచ్చారని తెదేపా నేత బుద్దా వెంకన్న విమర్శించారు. గుడిని.. గుడిలో లింగాన్ని దోచే వెల్లంపల్లి శ్రీనివాస్‌ను దేవదాయ శాఖ మంత్రిగా చేశారని మండిపడ్డారు. మంత్రి వెల్లంపల్లి దోచుకున్న రూ.1,525 కోట్ల సంగతేంటని.. సీఎం జగన్‌ను ప్రశ్నించారు.
వైకాపాపై బుద్ధా వెంకన్న మండిపాటు