ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైకాపాలో చేరలేదనే కోపంతోనే పల్లాపై కక్ష సాధింపు: బుద్ధా వెంకన్న - attacks on tdp leaders news

పల్లా శ్రీనివాస్​.. వైకాపాలో చేరలేదనే కోపంతో విజయసాయి రెడ్డి, అవంతి శ్రీనివాస్​లు అతనిపై కక్ష సాధిస్తున్నారని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. విశాఖలో అధికార పార్టీకి పట్టులేకపోవటం వల్లే బీసీ నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నారన్నారు.

buddha venkanna
బుద్ధా వెంకన్న

By

Published : Jun 15, 2021, 1:13 PM IST

వైకాపాలో చేరలేదనే కోపంతోనే పల్లా శ్రీనివాస్​పై విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్​లు కక్ష సాధిస్తున్నారని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. అధికార పార్టీలో చేరటం లేదని విశాఖ సహా, ఉత్తరాంధ్ర ప్రాంత తెదేపా నేతలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో వైకాపాకు పట్టు లేకపోవటం వల్లే బలమైన బీసీ నేతలను లక్ష్యంగా చేసుకున్నారని మండిపడ్డారు.

తమ పార్టీలోనే దొంగలు, దోపిడీదారులు, కబ్జాకోరులను పెట్టుకుని తెదేపాను నిందించటం విడ్డూరంగా ఉందన్నారు. విజయమ్మను విశాఖవాసులు ఓడించారనే అక్కసుతోనే నగరవాసులపై విజయసాయి రెడ్డి విద్వేషం చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిలో రాజ్యసభలో సభ్యత్వం ముగుస్తుందని.. విశాఖలో ఎంపీగా పోటీ చేసి ప్రజల్లో తనకున్న ఆదరణను నిరూపించుకోవాలని విజయసాయిరెడ్డికి బుద్ధా వెంకన్న సవాల్​ విసిరారు.

ఇదీ చదవండి:సర్పంచ్​ భర్తపై దాడి దారుణం.. 24 గంటల్లో అరెస్ట్ చేయకుంటే ఆందోళన: తెదేపా

ABOUT THE AUTHOR

...view details