Buddha Venkanna: తెదేపా అధినేత చంద్రబాబునాయుడిని కాపాడుకునేందుకు వంద మందితో దళాన్ని సిద్ధం చేశామని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తెలిపారు. తాము ఎవరి జోలికీ వెళ్లబోమని.. కానీ తమ అధినేత, వారి కుటుంబం జోలికి ఎవరైనా వస్తే వదిలిపెట్టబోమని హెచ్చరించారు. చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని విజయవాడ మల్లికార్జునపేటలోని తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ కటౌట్‌కు అధికార ప్రతినిధి నాగుల్‌మీరాతో కలిసి వెంకన్న బుధవారం పాలాభిషేకం నిర్వహించారు. పేద మహిళలకు చీరలు పంపిణీ అనంతరం వెంకన్న మాట్లాడారు.
తెదేపా నేత బుద్ధా వెంకన్న వివాదాస్పద వ్యాఖ్యలు.. - బుద్ధా వెంకన్న వివాదాస్పద వ్యాఖ్యలు
Buddha Venkanna: బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో విజయవాడలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధ వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై చెత్త వాగుడు వాగే వాళ్ల కోసం 100 మందితో సూసైడ్ బ్యాచ్‌ను తయారుచేసుకున్నామని తెలియజేశారు. చంద్రబాబు లేదా ఆయన కుటుంబం జోలికొస్తే వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
పదవుల కోసం చంద్రబాబును దూషించడం, దాడులు చేయడం వైకాపా నాయకులకు అలవాటుగా మారిందన్నారు. చంద్రబాబు ఇంటిపైన దాడికి దిగారని జోగి రమేష్‌కు ముఖ్యమంత్రి జగన్ మంత్రి పదవి ఇచ్చారని ఆరోపించారు. ఇదే తరహాలో రానున్న రెండేళ్లలో దూషించడం, దాడులకు దిగే వారిని చంపడానికి లేదా చావడానికైనా సిద్ధపడే ఆత్మాహుతి దళాన్ని వంద మందితో సిద్ధం చేశామన్నారు. నాగుల్‌మీరా మాట్లాడుతూ వైకాపా నాయకులు కక్ష సాధింపు మానుకొని పాలనపై శ్రద్ధ చూపాలన్నారు.
ఇదీ చదవండి: TDP Membership: రేపటి నుంచి తెదేపా సభ్యత్వ నమోదు.. ఇకపై వాట్సాప్‌లోనూ