మీడియా గొంతు నొక్కుతూ జీఓ 2430 తీసుకురావడంతో పాటు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. విచారణ పేరుతో పాత్రికేయుల్ని జగన్ రెడ్డి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో పాత్రికేయుడిగా పనిచేసి ప్రస్తుతం ప్రశ్నించే సామర్థ్యాన్ని స్వార్థం కోసం జగన్ రెడ్డి దగ్గర తాకట్టు పెట్టిన సజ్జల రామకృష్ణా రెడ్డికి మీడియా స్వేచ్ఛ గుర్తుకు రావడం పెద్ద విశేషమేనని బుద్దా విమర్శించారు.
'సజ్జలకు మీడియా స్వేచ్ఛ గుర్తుకు రావడం పెద్ద విశేషం' - సజ్జల రామకృష్ణా రెడ్డిపై బుద్దా వెంకన్న కామెంట్స్
సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంటే లాడెన్ శాంతి ప్రవచనాలు చెప్పినట్టు ఉందని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. సజ్జలకు మీడియా స్వేచ్ఛ గురించి గుర్తుకు రావడం పెద్ద విశేషమేనని వ్యాఖ్యానించారు.
!['సజ్జలకు మీడియా స్వేచ్ఛ గుర్తుకు రావడం పెద్ద విశేషం' budda venkanna comments on sajjala ramakrishnareddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8824001-734-8824001-1600264777976.jpg)
budda venkanna comments on sajjala ramakrishnareddy