కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడు వద్ద జాతీయ రహదారిపై విషాదం చోటు చేసుకుంది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు.
విషాదం: రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి - పొట్టిపాడు వద్ద రోడ్డు ప్రమాదం
ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. ఈ ప్రమాదం కృష్ణా జిల్లా పొట్టిపాడు వద్ద జరిగింది. మృతులు విజయనగరం జిల్లా వాసులుగా గుర్తించారు.
రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల మృతి
విజయనగరం జిల్లాకు చెందిన సింహాచలం(29), ఈశ్వరరావు(22) అనే ఇద్దరు అన్నదమ్ములు విజయనగరం నుంచి హైదరాబాద్ బైక్పై బయలుదేరారు. తెల్లవారుజామున పొట్టిపాడు వద్ద జాతీయ రహదారిపై లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని స్థానికుల సాయంతో అత్కూరు పోలీసులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా..మార్గ మధ్యలో ఒకరు మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం.
ఇదీ చదవండి:అనంతలో వ్యక్తి దారుణ హత్య.. కారణం ఏంటంటే..?