ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చెల్లికి న్యాయం కోసం.. ఎడ్లబండిపై దిల్లీకి అన్న - ఎడ్లబండిపై దిల్లీకి బయలుదేరిన ఆంధ్రవ్యక్తి

ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలానికి చెందిన నాగదుర్గరావు..  తన చెల్లికి న్యాయం చేయాలంటూ ఎడ్లబండిపై దిల్లీ పయనమయ్యాడు. తన సోదరిపై అంతింటివారి వేధింపులను పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న నాగదుర్గారావు.. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తానని దిల్లీకి బయలుదేరాడు.

naga durgarao travelling to Delhi on Bullock cart
ఎడ్లబండిపై దిల్లీ బయలుదేరిన అన్న

By

Published : May 25, 2022, 8:43 PM IST

Updated : May 25, 2022, 9:05 PM IST

పెళ్లైయినప్పటి నుంచి తన చెల్లెలును బావ సరిగ్గా చూసుకోవడం లేదని.. తన చెల్లికి న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్రం నుంచి దిల్లీకి ఎడ్లబండిమీద ప్రయాణమయ్యాడో సోదరుడు. ప్రస్తుతం ఆ యాత్ర ఖమ్మం జిల్లా వద్ద తెలంగాణలోకి ప్రవేశించింది. ఎన్టీఅర్‌ జిల్లా నందిగామ మండలం ముప్పాలకి చెందిన నాగదుర్గరావు.. అతని చెల్లెలు సత్యవతిని చందాపురానికి చెందిన నరేంద్రనాథ్‌కిచ్చి 2018లో వివాహం చేశారు. పెళ్లి జరిగినప్పటి నుంచి భర్త తనతో సరిగ్గా ఉండడంలేదంటూ పుట్టింటికి వచ్చేసింది సత్యవతి. భర్త కుటుంబ సభ్యులు తనను వేధిస్తున్నారని ఆమె పేర్కొంది. ఈ విషయమై నాగదుర్గరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా ఫలితం లేకపోవడంతో తన చెల్లికి న్యాయం చేయాలంటూ ఎడ్లబండిపై దిల్లీ ప్రయాణమయ్యాడు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తానని చెప్పాడు బాధితురాలి అన్న దుర్గప్రసాద్‌.

చెల్లికి న్యాయం చేయాలంటూ.. ఎడ్లబండిపై దిల్లీ బయలుదేరిన అన్న
Last Updated : May 25, 2022, 9:05 PM IST

ABOUT THE AUTHOR

...view details