జగన్ గెలుపు కోసం పని చేసిన క్రైస్తవులు ఆవేదనతో ఉన్నారని బ్రదర్ అనిల్ అన్నారు. విజయవాడలోని ఓ హోటల్‌లో బీసీ, మైనారిటీ, క్రిస్టియన్ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన బ్రదర్ అనిల్.. కొత్త పార్టీ పెడతామని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
జగన్ గెలుపు కోసం పని చేసిన క్రైస్తవులు ఆవేదనతో ఉన్నారు: బ్రదర్ అనిల్ - ఏపీలో బ్రదర్ అనిల్ కొత్త పార్టీ
14:39 March 07
పలు సంఘాలతో బ్రదర్ అనిల్ సమావేశం
సమస్యలు పరిష్కరిస్తారని జగన్‌కు ఓటేశామని.. కానీ.. ఆయనతో మాట్లాడేందుకు అనుమతి కూడా దొరకట్లేదని సమావేశానికి హాజరైన బీసీ సంఘం నేత శొంఠి నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై చర్చించేందుకు అనిల్‌ను కలిశామన్న నాగరాజు.. త్వరలోనే తమకు శుభవార్త చెబుతామని బ్రదర్ అనిల్ చెప్పారని వారు తెలిపారు.
"సమస్యలు పరిష్కరిస్తారని జగన్‌కు ఓటేశాం. సీఎంతో మాట్లాడేందుకు అనుమతి కూడా దొరకట్లేదు. సమస్యలపై చర్చించేందుకు అనిల్‌ను కలిశాం. బ్రదర్ అనిల్ చెబితేనే ఎన్నికల్లో ఓట్లు వేశాం, రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కావాలని ఆయన్ను కోరాం. మా సమస్యలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు." -నాగరాజు, బీసీ సంక్షేమ సంఘం నేత
ఇదీ చదవండి : తెదేపా నేతల వాహనాలను అడ్డుకున్న పోలీసులు.. కార్యకర్తల ఆందోళన