సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన జగన్, మోదీకి లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికలను ఎవ్వరు యుద్ధంలా చూడొద్దని నేతలకు సూచించారు. కేంద్రం నుంచి న్యాయబద్ధంగా రావాల్సిన వాటిన తెచ్చేందుకు జగన్ కృషి చేయాలని...రాష్ట్రానికి రూ. 80 వేల కోట్లు కేంద్రం ఇవ్వవలసి ఉందని తెలిపారు. దిల్లీ నుంచి నిధులు రానిపక్షంలో కట్టిన పన్నులు అందేలా ఒప్పించాలని వ్యాఖ్యానించారు.
'రావాల్సిన నిధులు రాష్ట్రానికి తీసుకురండి' - jagan
ఎన్నికల్లో అఖండ విజయం నమోదు చేసిన జగన్, మోదీకి లోక్‌సత్తా వ్యవస్థాపక అధినేత అధ్యక్షుడు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు కేంద్రం నుంచి రాబట్టుకోవాలని సూచించారు.
'మన నిధులు రాష్ట్రానికి తీసుకురండి'
నేను ఇచ్చా, నేను ఇస్తా అనడం సరికాదు
ప్రజల సొమ్మును తమ స్వార్థానికి పంచి గొప్పగా చెప్పుకోవడం నేతలకే చెల్లిందని జేపీ అన్నారు. నేను ఇచ్చా, నేను ఇస్తా అని నేతలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారం కోసం ఇష్టమొచ్చినట్లు తాయిలాలు ప్రకటించి ప్రజలను సోమరులను చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం కోట్లు ఖర్చు పెడితే ప్రజాసేవ ఎలా చేసినట్లని ప్రశ్నంచారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు పంతాలు వీడి ఏపీకి న్యాయం జరిగేలా చూడాలని సూచించారు.