కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యూనల్ విచారణలో...తరువాతి క్రాస్ ఎగ్జామినేషన్ వచ్చే నెలకు వాయిదా పడింది. తెలంగాణ తరఫు సాక్షి ఘన్‌శ్యామ్‌ను ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. కరోనా, న్యాయమూర్తి రాజీనామా కారణంగా దాదాపు ఏడాదిన్నర తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రైబ్యూనల్ బుధవారం విచారణ ప్రారంభించింది. సాగర్ ప్రాజెక్టు, కేసీ కెనాల్, పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతలపై ప్రశ్నలకు ఘన్ శ్యామ్ సమాధానం ఇచ్చారు. కృష్ణా డెల్టాకు నీరందించేందుకు నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. తదుపరి క్రాస్ ఎగ్జామినేషన్‌ను వచ్చే నెల 28, 29, 30 తేదీలకు వాయిదా వేస్తున్నట్లు బ్రిజేష్ కుమార్ తెలిపారు.
కృష్ణా జలాల వివాదంపై బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్‌లో విచారణ - కృష్ణా జలాల వివాదంపై బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్‌లో విచారణ వార్తలు
కృష్ణా జలాల వివాదంపై బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్‌లో విచారణ జరిగింది. తెలంగాణ తరఫు సాక్షి ఘన్‌శ్యామ్‌ను ఏపీ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. సాగర్ ప్రాజెక్టు, కేసీ కెనాల్, కృష్ణా డెల్టాకు నీటిపై క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది.
కృష్ణా జలాల వివాదంపై బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్‌లో విచారణ