తెలంగాణలోని ములుగు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పన్నెండేళ్ల బాలికపై బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ములుగు మండల పరిధిలోని ఓ గ్రామంలో నివసించే బాలిక.. సమీపంలోని ఇంటికి తరచూ టీవీ చూసేందుకు వెళ్లేది. అదే చనువుతో నిన్న మధ్యాహ్నం కూడా టీవీ చూసేందుకు వారి ఇంటికి వెళ్లింది. ఆ ఇంట్లో బాలుడు ఒక్కడే ఉండటంతో ఒంటరిగా వచ్చిన చిన్నారిని అత్యాచారం చేశాడు.
కొద్ది సమయం తర్వాత ఇంటికి వచ్చిన కూతురు ఆందోళనగా ఉండటం చూసి ఏం జరిగిందని తల్లి ఆరా తీసింది. జరిగిన సంఘటన గురించి చెప్పడంతో.. ఈ రోజు బాలిక తల్లిదండ్రులు ములుగు పోలీసులకు ఫిర్యాదు చేశారు.