ఒకే చోట రూ. లక్ష కోట్లు ఖర్చు సరికాదని జగన్ గతంలోనే చెప్పారని మంత్రి బొత్స గుర్తు చేశారు. పార్లమెంటు స్థానాలను జిల్లాలు చేస్తామని ఎన్నికల ముందే హామీ ఇచ్చామన్నారు. ఇచ్చిన హామీలనే జగన్ ఇప్పుడు నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు.
శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పిందో చంద్రబాబు తెలుసుకోవాలి. నారాయణ కమిటీ ప్రజల అభిప్రాయాలు తీసుకోలేదు. 3 ప్రాంతాలూ అభివృద్ధి చెందాలా.. వద్దా.. చంద్రబాబు చెప్పాలి. అమరావతి రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం. ఒకపార్టీ ఆదేశాల మేరకు అమరావతి రైతులు ఆందోళన చేస్తున్నారు.