ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వికేంద్రీకరణ అంటే బిచ్చమెత్తుకోవడమా.. తెదేపా నేత బొండా విమర్శలు - Bonda Umamaheswara Rao responded

TDP leaders: సర్పంచ్‌లను బిచ్చమెత్తుకునే స్థాయికి దిగజార్చడమే జగన్ వికేంద్రీకరణ అని తెలుగుదేశం నేత బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణకు అర్ధం కూడా జగన్‌కు తెలియదన్నారు. విశాఖలో భూములను దోచుకునేందుకే రాజధాని చేస్తామంటున్నారని మండిపడ్డారు. ఒక రాజధానినే పూర్తి చేయలేని సీఎం మూడు రాజధానులు ఎలా కడతారని.. ఆయన ఎద్దేవా చేశారు.

Bonda Umamaheswara Rao
తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు

By

Published : Oct 7, 2022, 2:58 PM IST

Bonda Umamaheswara Rao: సర్పంచ్‌లను బిచ్చమెత్తుకునే స్థాయికి దిగజార్చడమే జగన్ వికేంద్రీకరణ అని తెలుగుదేశం నేత బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణకు అర్ధం కూడా జగన్‌కు తెలియదన్నారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే గ్రామాలను అభివృద్ధి చేయాలని సవాల్‌ విసిరారు. విశాఖలో భూములను దోచుకునేందుకు రాజధాని చేస్తామంటున్నారని విమర్శించారు. ఒక రాజధానినే పూర్తి చేయలేని సీఎం మూడింటిని ఎలా కడతారో ప్రజలకు అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.

దోచుకో, దాచుకో, తెచ్చుకో అనే నినాదమే వైకాపా నేతలకు తెలిసిన వికేంద్రీకరణ అని పేర్కొన్నారు. పాదయాత్ర చేస్తున్న రైతులపై జోలికి వస్తే.. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు చెప్పులతో కొడతారన్నారు. మూడు రాజధానుల బిల్లులు చెల్లవని న్యాయస్థానాలు చెప్పినా, జగన్ తన పరిపాలనా వైఫల్యాల దృష్టి మళ్లించేందుకు మొండి వాదనలు చేస్తున్నారని తెలిపారు. ఉప ప్రణాళిక నిధులను మళ్లించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను మోసం చేశారని బోండా ఉమా ఆరోపించారు.

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details