జూనియర్ ఎన్టీఆర్ను రాజకీయంగాను, అన్ని విధాలా వాడుకుంది... కొడాలి నాని, వంశీనే అని తెదేపా మాజీఎమ్మెల్యే బొండా ఉమ ఆరోపించారు. వీరిద్దరి కారణంగానే జూనియర్ ఎన్టీఆర్ తెదేపాకు దూరమయ్యారని పేర్కొన్నారు. వల్లభనేని వంశీ ఎవరి స్క్రిప్ట్ చదువుతున్నారో అందరికి తెలుసని బొండా విమర్శించారు. వలస పక్షులు ఎవరు అధికారంలో ఉంటే... వాళ్ల దగ్గర చేరతారని ఎద్దేవా చేశారు. గతంలో తిరుమల వెంకన్నతో పెట్టుకుంటే ఏమయిందో... కొడాలి నాని గుర్తు చేసుకోవాలని హితవు పలికారు.
'వాళ్లిద్దరి కారణంగానే... ఎన్టీఆర్ తెదేపాకు దూరమయ్యారు' - మంత్రి కొడాలి నానిపై బోండా ఉమ ఫైర్ న్యూస్
కొడాలి నానిపై తెదేపా నేత బొండా ఉమ విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ తెదేపాకు దూరమయ్యేందుకు కొడాలి నాని, వల్లభనేని వంశీనే కారణమని ఆరోపించారు.
bonda uma fires on minister kodali nani