ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'న్యాయస్థానాలు చీవాట్లు పెడుతున్నా ప్రభుత్వానికి పట్టట్లేదు' - వైకాపా ప్రభుత్వంపై బొండా ఉమ విమర్శలు

న్యాయస్థానాలు ప్రతిసారి చీవాట్లు పెడుతున్నావైకాపా ప్రభుత్వం తీరు మార్చుకోవట్లేదని తెదేపా నేత బొండా ఉమా విమర్శించారు. లెక్కలేనితనంతో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. లోపాలు సరిదిద్దుకోకుండా మూర్ఖపు ఆలోచనలతో ముందుకెళ్తున్నారని దుయ్యబట్టారు.

bonda uma
బొండా ఉమ, తెదేపా నేత

By

Published : Nov 21, 2020, 4:21 PM IST

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం సైకోయిజంతో పని చేస్తోందని తెదేపా పొలిట్​బ్యూరో సభ్యులు బొండా ఉమా ధ్వజమెత్తారు. మతిలేని ప్రభుత్వం అని న్యాయస్థానం చెప్పినా ఈ ప్రభుత్వానికి పట్టట్లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర పరువుపై దేశమంతా కోడై కూస్తున్నా లెక్కలేనితనంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

స్వాతంత్య్రం వచ్చాక దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎంను అక్కడ ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానాలు వైకాపా ప్రభుత్వాన్ని విమర్శించినట్లు దాఖలాలు లేవన్నారు. సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు వరకు అన్ని న్యాయస్థానాలు పదేపదే చీవాట్లు పెడుతున్నా లోపాలు సరిదిద్దుకోకుండా మూర్ఖపు ఆలోచనలతో ముందుకెళ్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు సీఎం జగన్ కనుసన్నల్లో పని చేస్తున్నారని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం చెప్పినట్లుగా తలాడించి అనేకమంది పోలీసు అధికారులు బలైపోతున్నారని ఉమా అన్నారు.

ABOUT THE AUTHOR

...view details