ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆ నిధులపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా?: బొండా - జగన్​పై బొండా ఉమా కామెంట్స్​

రాష్ట్రంలో అభివృద్ధి చేసి చూపించింది తెలుగుదేశం ప్రభుత్వమేనని తెదేపా నేత బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. సంబంధించిన ఆధారాలు చూపగల సత్తా తమకుందని స్పష్టంచేశారు.

bonda uma comments on ysrcp govt
bonda uma comments on ysrcp govt

By

Published : Aug 12, 2020, 4:36 PM IST

15 నెలల్లో రాష్ట్రాభివృద్ధికి ఖర్చు చేసిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేసే ధైర్యం ప్రభుత్వానికి ఉందా.. అని బొండా ఉమా సవాల్ విసిరారు. 64 వేల కోట్ల రూపాయలను తెదేపా ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకే ఖర్చు చేసిందన్న ఆయన.. ఈ ప్రభుత్వం లక్షకోట్లు అప్పుతెచ్చి, ప్రజలకు చిల్లర పంచి, మిగిలింది దోచేసిందని విమర్శించారు. రాష్ట్రం శాశ్వతం గానీ, వ్యక్తులు కాదనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని హితవు పలికారు. తమ జీవితాలు ఇప్పుడెందుకు తలకిందులయ్యాయో ప్రజలంతా ఆలోచించాలని బొండా ఉమా సూచించారు.

ABOUT THE AUTHOR

...view details