పక్కా ప్రణాళిక ప్రకారమే మాజీ మంత్రి వివేకా హత్య జరిగిందని తెదేపా నేత బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. వివేకా హత్యను మొదట గుండెపోటుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారన్నారు. దస్తగిరి అప్రూవర్‌గా మారాక తాడేపల్లిలో వణుకు మొదలైందన్నారు. సీబీఐ విచారణను సజ్జల తప్పుపట్టడం బరితెగింపేనని దుయ్యబట్టారు. వివేకా హత్యకు అవినాష్‌రెడ్డే ప్రధాన కారణమని సీబీఐ స్పష్టం చేసినా..ఆయన్ను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
ప్రతిపక్షంలో ఉండగా వివేకా హత్యపై సీబీఐ విచారణ కోరిన జగన్..అధికారంలోకి రాగానే సీబీఐ విచారణ అవసరం లేదని హైకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకోవటం వాస్తవం కాదా ? అని నిలదీశారు. వైకాపా నాయకులు సీబీఐని బ్లాక్‌మెయిల్ చేసే పరిస్థితికి వచ్చారని విరుచుకుపడ్డారు.
"పక్కా ప్రణాళిక ప్రకారమే వివేకా హత్య. వివేకా హత్యను మొదట గుండెపోటుగా చిత్రీకరించారు. దస్తగిరి అప్రూవర్‌గా మారాకా తాడేపల్లిలో వణుకు మొదలైంది. వైకాపా నాయకులు సీబీఐని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉండగా సీబీఐ విచారణ కోరారు. అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణ అవసరం లేదన్నారు. సీబీఐ విచారణ వద్దంటూ హైకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. అవినాష్‌రెడ్డిని కాపాడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు." -బొండా ఉమ, తెదేపా నేత