ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బొండా ఉమ.. దూకేశారు! - bonda uma

విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు... న్యూజిల్యాండ్​లోని ఏజె హాకిట్‌ బంగీ పాయింట్‌ నుంచి బంగీ జంప్‌ చేశారు. ఈ సాహస కృత్యం చిత్రాలు, వీడియోలు తన ఫేస్​బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.

బొండా ఉమ దూకేశాడు

By

Published : Aug 1, 2019, 8:58 PM IST

బొండా ఉమ దూకేశాడు

విదేశీ పర్యటనల్లో మన రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు పలు సాహస క్రీడల్లో పాల్గొనడం సర్వసాధారణంగా మారింది. తాజాగా న్యూజిల్యాండ్‌ పర్యటనకు వెళ్లిన విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు... బంగీ జంప్‌ చేసి తన అభిలాషను చాటుకున్నారు. న్యూజిలాండ్‌ దేశంలోని క్వీన్‌స్టన్‌ ప్రాంతంలో బంగీ జంప్‌లకు కేంద్రంగా నిలుస్తోన్న ఏజె హాకిట్‌ బంగీ పాయింట్‌ నుంచి... బొండా ఉమ ఈ సాహస కృత్యం చేశారు.

తన జీవిత గమనంలో ధైర్యం, సాహస మార్గాన్ని తాను ఎంచుకున్నానని... అందుకే బంగీ జంప్‌ ద్వారా తన సత్తా చాటేందుకు ముందుకొచ్చినట్లు ఫేస్‌బుక్‌ ఖాతాలో ఫోటోలు, వీడియాను పోస్టు చేశారు. 134 మీటర్ల ఎత్తు నుంచి ఒక్కసారిగా జంప్‌ చేశారు. నిపుణుల పర్యవేక్షణలో ఈ సాహసం చేశారు. రెండేళ్ల క్రితం ప్రస్తుత సీఎం జగన్‌ మోహన్​రెడ్డి న్యూజిల్యాండ్‌ పర్యటన సమయంలో ఈ ప్రాంతం నుంచే బంగీజంప్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details