ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వినియోగించే బోయింగ్ 777 విమానం గన్నవరంలో బుధవారం రాత్రి విజయవంతంగా ల్యాండ్ చేసి, తిరిగి టేకాఫ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో గన్నవరం విమానాశ్రయంలో వీవీఐపీలు నేరుగా ల్యాండ్ అయ్యేందుకు అవసరమైన సౌకర్యాలన్నీ ఉన్నాయని పేర్కొన్నారు.ఎయిర్ ఇండియా వన్‌గా పిలిచే ఈ విమాన సర్వీసును ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సహా వీవీఐపీలు విదేశీ పర్యటనలకు వినియోగిస్తుంటారు.
ఇకనుంచి గన్నవరం విమానాశ్రయానికి బోయింగ్ 777 - Boeing 777 Aircraft landing at Gannavaram Airport
బుధవారం రాత్రి గన్నవరం విమానాశ్రయంలో బోయింగ్ 777 విమానాన్ని అధికారులు ల్యాండ్ చేసి, తిరిగి టేకాఫ్ చేశారు. ఎయిర్ ఇండియా వన్‌గా పిలిచే ఈ విమాన సర్వీసును ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సహా వీవీఐపీలు విదేశీ పర్యటనలకు వినియోగిస్తుంటారు. భవిష్యత్తులో గన్నవరం విమానాశ్రయంలో వీవీఐపీలు నేరుగా ల్యాండ్ అయ్యేందుకు అవసరమైన సౌకర్యాలన్నీ ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు
![ఇకనుంచి గన్నవరం విమానాశ్రయానికి బోయింగ్ 777 Gannavaram Airport](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12888888-903-12888888-1630038095137.jpg)
దేశంలోని వివిధ విమానాశ్రయాల్లో బోయింగ్ 777 ల్యాండ్ చేసేందుకు ఉన్న అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. గత నెలలో గన్నవరం విమానాశ్రయాన్ని పరిశీలించిన అధికారులు.. విమానాశ్రయంలో కొత్తగా నిర్మించిన 'రన్‌వే'ను జులై నుంచి అందుబాటులోనికి తీసుకొచ్చారు. గతంలో ఉన్న రన్‌వే 7500 అడుగుల విస్తీర్ణంలో ఉండగా.. తాజాగా 11,023 అడుగులకు పెరిగింది. దీంతో భారీ విమాన సర్వీసులు సైతం ల్యాండ్ అయ్యేందుకు వీలు కలిగింది. ప్రస్తుతం ఎయిర్‌బస్ ఎ380, ఎ340, బోయింగ్ 747, 777 లాంటి కోడ్ ఈ స్థాయి విమానాల రాకపోకలు సాగించవచ్చు.
ఇదీ చదవండి