నదుల్లో పర్యటక బోట్లు ప్రమాదాల నివారణ కోసం నదీ తీర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసింది. నిరంతర పర్యవేక్షణ, భద్రత కోసం రాష్ట్రవ్యాప్తంగా 9 చోట్ల కంట్రోల్ కేంద్రాలను నెలకొల్పింది. అన్ని అనుమతులు తీసుకోవడం సహా తగిన భద్రతా ప్రమాణాలు పాటిస్తేనే నదిలో బోటింగ్ కు అనుమతులు ఇచ్చేలా సరికొత్త నిబంధనలను అమలు చేయనుంది. బోట్ల రిజిస్ట్రేషన్, లైసెన్సులు, ఫిట్‌నెస్ పరిశీలన పకడ్భందీగా చేసేలా ఏర్పాట్లు చేశారు. ప్రమాదాల జరగకుండా పర్యటక, రెవెన్యూ, పోలీసు అధికారులు, ఎస్డీఆర్ఎఫ్ భద్రతా సిబ్బంది నిరంతరం పనిచేయనున్నారు. కంట్రోల్ రూంల పర్యవేక్షణ బాధ్యతలను తహసీల్దారు హోదా కల్గిన అధికారిని నియమించింది. ప్రతి కంట్రోల్ రూంలో సీసీటీవీ పర్యవేక్షణ సహా ప్రమాదంలో ఉన్నవారిని రక్షించడానికి పెట్రోలింగ్, రెస్క్యూ బోట్లు, లైఫ్ జాకెట్లు నిరంతరం అందుబాటులో ఉంచుతున్నట్లు ఈటీవీ భారత్ ముఖాముఖిలో అధికారులు వివరించారు.
'కంట్రోల్ రూంలతో బోటు ప్రమాదాలను వంద శాతం అరికట్టవచ్చు' - BOATING CONTROL ROOMS news
నదీతీర ప్రాంతాల్లో ఏర్పాటైన కంట్రోల్ రూంల ద్వారా పర్యటక బోట్ల ప్రమాదాలను 100శాతం నివారించగలుగుతామని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు శాఖలు సమన్వయంతో పనిచేస్తూ... అన్ని అంశాల్లో బోట్ సామర్థ్యాన్ని పరీక్షించి అనుమతిచ్చాకే అవి ప్రయాణానికి బయల్దేరతాయని స్పష్టం చేస్తున్నారు. విజయవాడ బరంపార్కు వద్ద ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలో చేపట్టబోయే కార్యకలాపాల గురించి అక్కడి అధికారితో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
పర్యటక కంట్రోల్ రూమ్ల ఏర్పాటు