హమ్మయ్య... ప్రకాశం బ్యారేజ్లో పడవ బయటికొచ్చింది! - gate under crust gate
ప్రకాశం బ్యారేజ్ క్రస్ట్ గేట్ కింద చిక్కుకున్న పడవను తొలగించడంలో.. సిబ్బంది విజయం సాధిస్తున్నారు. కొన్ని రోజులుగా గేటు కిందే కదలకుండా మొరాయించిన పడవను.. ఇవాళ బయటికి తీశారు.
barrage
విజయవాడ ప్రకాశం బ్యారేజివద్ద ఇరుకున్న పడవ ఎట్టకేలకు బయటికొచ్చింది. నిపుణుల బృందాల విశ్వ ప్రయత్నాలు ఫలించాయి. 5 రోజుల నుంచి గేటు కిందే ఇరుక్కున్న పడవకు.. రంధ్రాలు చేసి ఇనుపతాడు సాయంతో బయటకు తీశారు. ఈ ప్రయత్నంలో.. కాకినాడ, బళ్లారి, పులిచింతల, భైరవానితిప్ప నిపుణుల బృందాలు భాగం పంచుకున్నాయి.