fee reimbursement: కళాశాలల్లో ఫీజు రీయింబర్స్మెంట్ గురించి తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చేస్తున్నది ఏపీ మాత్రమేనని చెప్పారు.
గతంలో ఐదేళ్లకు ఒక్కసారి మాత్రమే బకాయిలు విడుదల చేసేవారని, ప్రస్తుతం ప్రతీ మూడు నెలలకోసారి ఫీజులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో కళాశాలలు ఆర్ధిక ఇబ్బందులు లేకుండా నడుస్తున్నాయన్నారు.
విద్యార్థులు అదనంగా ఒక్క రూపాయి కూడా కళాశాలలకు చెల్లించాల్సిన పనిలేదని తేల్చి చెప్పారు. కళాశాలల యాజమాన్యం ఫీజుల కోసం బలవంతం చేస్తే ఫీజు నియంత్రణ కమిషన్కు ఫిర్యాదు చేయవచ్చన్నారు.
గడిచిన మూడేళ్లలో పది వేల కోట్ల రూపాయల మేర ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేసినట్టు తెలిపారు. మరోవైపు జూన్ మొదటి వారంలోనే ఈఏపీ సెట్ నిర్వహణకు చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. సెప్టెంబరు నాటికి అన్ని సెట్లనూ పూర్తి చేస్తామన్నారు.
ఇదీ చదవండి: accident: వాయు వేగంతో వచ్చిన కారు.. కల్వర్టులోకి దూసుకెళ్లింది!