స్వచ్ఛందంగా రక్తనిధి కేంద్రాలకు వచ్చిన వారి నుంచి రక్తం సేకరించేందుకు ప్రభుత్వం రెడ్ క్రాస్ సొసైటీ, రక్త నిధి కేంద్రాలకు అనుమతులిచ్చింది . దీంతో రక్తదానం చేసేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. రక్తదాతల నుంచి రక్తం సేకరించే ముందు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారి పూర్తి ప్రయాణ వివరాలు అధికారులు సేకరిస్తున్నారు. దీంతోపాటు జలుబు, దగ్గు, జ్వరం నిర్ధరణ పరీక్షలు చేస్తున్నారు. అత్యవసర సమయంలో యువకులు ముందుకొచ్చి రక్తదానం చేయాలని అధికారులు కోరుతున్నారు.
లాక్డౌన్లోనూ రక్తదానం.. కానీ పరీక్షలు తప్పనిసరి - లాక్డౌన్లో రక్తదానం
లాక్డౌన్ ప్రభావం రక్త సేకరణపై పడింది. దీంతో తలసేమియా రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రక్త నిధి కేంద్రాలకు రక్తం సేకరించేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. రక్తదానం చేసేందుకు దాతలు ముందుకొస్తున్నారు.
![లాక్డౌన్లోనూ రక్తదానం.. కానీ పరీక్షలు తప్పనిసరి blood donation during lock down](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6882784-1011-6882784-1587469983383.jpg)
లాక్డౌన్లోనూ రక్తదానం