ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

యువకుడి గొంతు కోసిన బ్లేడ్ బ్యాచ్ - యువకుడి గొంతు కోసిన బ్లేడ్ బ్యాచ్ న్యూస్

బ్లేడ్ బ్యాచ్​ ముఠా సభ్యుడు ఓ యువకుడి గొంతుకోసి హత్యాయత్నానికి పాల్పడ్డిన ఘటన విజయవాడ నగర శివారు రామవరప్పాడులో చోటుచేసుకుంది. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా...దారుణానికి ఒడిగట్టింది స్థానికంగా ఉన్న బ్లేడ్ బ్యాచ్​ సభ్యులు సాహో అతని స్నేహితులుగా పోలీసులు గుర్తించారు.

యువకుడి గొంతు కోసిన బ్లేడ్ బ్యాచ్
యువకుడి గొంతు కోసిన బ్లేడ్ బ్యాచ్

By

Published : Nov 16, 2020, 2:24 AM IST

విజయవాడ నగర శివారు రామవరప్పాడులో దారుణం చోటుచేసుకుంది. బ్లేడ్ బ్యాచ్​ ముఠా సభ్యుడు ఓ యువకుడి గొంతుకోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే... హన్​మాన్ నగర్ శివారు పొలాల్లో గంజాయి సేవించిన నలుగురు యువకుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఘర్షణలో సురేంద్ర అనే యువకుడి పై సాహో అలియాస్ సాయి అనే వ్యక్తి బ్లేడ్​తో తీవ్రంగా దాడి చేశాడు. సురేంద్ర చనిపోతాడనే భయంతో అతని చొక్క మెడకు చుట్టి సమీపంలోని అపార్ట్​మెంట్ లిప్ట్​లో వదిలి వెళ్లాడు. రక్తపు మడుగులో కొనఊపిరితో ఉన్న సురేంద్రను గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దారుణానికి ఒడిగట్టింది స్థానికంగా ఉన్న బ్లేడ్ బ్యాచ్​ సభ్యులు సాహో అతని స్నేహితులుగా గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details