Somu Veerraju on YS Jagan: రేపు విజయవాడలో భారతీయ జనత యువ మోర్చా సంఘర్షణ యాత్ర ముగింపు సందర్బంగా బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్డులోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. సీఎం జగన్ బటన్ మీద చెయ్యి వేసి తియ్యడం లేదని.. కానుకల రూపంలో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ప్రజలు కూడా ఎన్నికలు ఎప్పుడొస్తాయా.. బటన్ ఎప్పుడు నొక్కుదామా అని ఎదురు చూస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
BJYM విజయవాడలో బిజెవైఎం యువ సంఘర్షణ ముగింపు సభ - ఆంధ్ర ప్రదేశ్ తాజావార్తాలు
Bjp in Vijayawada బిజెవైఎం యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన సంఘర్షణ యాత్ర ముగింపు సందర్భంగా విజయవాడలో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లను రాష్ట్రా భాజపా అధ్యక్షుడు పర్యవేక్షిస్తున్నారు.
Etv Bharat
ఏపీలోని నాలుగు ప్రాంతాల్లో యువ మోర్చా ఆధ్వర్యంలో 173 నియోజకవర్గాల్లో యాత్ర చేశామన్నారు. ఎండ, వానను తట్టుకుని సంఘర్షణ యాత్ర విజయవంతంగా సాగిందన్నారు. ఈ యాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించామని తెలిపారు. కాకినాడలో పెట్రో కెమికల్ కారిడార్ ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని, ఎయిమ్స్ వంటి సంస్థలను కేంద్రం ఏపీకి ఇచ్చిందన్నారు. కేంద్రం ఇచ్చిన వాటిని కూడా వైకాపా ప్రభుత్వం సరిగా వినియోగించుకోలేకపోతుందని దుయ్యబట్టారు.
ఇవి చదవండి: