ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి యువమోర్చా యత్నం.. - BJP Yuva Morcha

APPSC Obsession :జాబ్ క్యాలెండరు ప్రకటించాలంటూ భాజపా యువమోర్చా తలపెట్టిన ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. తెల్లవారుజాము నుంచే ముందస్తు అరెస్టులు, గృహనిర్భందాలు చేపట్టినా.. పోలీసుల కళ్లు కప్పి వివిధ ప్రాంతాల నుంచి యువమోర్చా సభ్యులు ఏపీపీఎస్సీ కార్యాలయానికి చేరుకున్నారు.

APPSC Obsession
ఏపిపిఎస్సీ కార్యాలయాన్ని ముట్టడికి భాజపా యువమోర్చా యత్నం...ఉద్రిక్తత, అరెస్టులు..

By

Published : Apr 22, 2022, 4:07 PM IST

BJP Yuva Morcha: జాబ్ క్యాలెండరు ప్రకటించాలంటూ భాజపా యువమోర్చా తలపెట్టిన ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ భాజపా యువమోర్చా ఆందోళనకు పిలుపునివ్వడంతో ఉదయం నుంచే ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. తెల్లవారుజాము నుంచే ముందస్తు అరెస్టులు, గృహనిర్భందాలు చేసినా.. పోలీసుల కళ్లు కప్పి వివిధ ప్రాంతాల నుంచి యువమోర్చా సభ్యులు ఏపీపీఎస్సీ కార్యాలయానికి చేరుకున్నారు.

ఏపిపిఎస్సీ కార్యాలయాన్ని ముట్టడికి భాజపా యువమోర్చా యత్నం...ఉద్రిక్తత, అరెస్టులు..

కార్యాలయంలోపలికి ఆందోళనకారులను వెళ్లనీయకుండా పోలీసులు నిలువరించారు. అయినప్పటికీ.. ఒక్కసారిగా యువ మోర్చా ప్రతినిధులు తరలి రావడంతో పోలీసులు బలవంతంగా అరెస్టు చేయడంతో తోపులాట, ఘర్షణ జరిగింది. ఆందోళనకారులను తరలిస్తున్న పోలీసు వాహనం తాళాలను యువ మోర్చా కార్యకర్తలు లాక్కెళ్లారు. మారుతాళాలతో వాహనాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించగా.. నేతలు అడ్డుకున్నారు. దీంతో.. కాసేపు వాగ్వాదం జరిగింది. ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందేనని నేతలు నినదించారు.

ఇదీ చదవండి :వాట్సాప్​ వీడియో కాల్​ లిఫ్ట్​ చేశారు.. అవతలి వారి ఉచ్చులో చిక్కుకున్నారు..!

ABOUT THE AUTHOR

...view details