ఎన్నికల కమిషనర్ వ్యవహారంలో హైకోర్టు తీర్పును భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి స్వాగతించారు. స్థానిక ఎన్నికల్లో అవకతవకలు, ఎన్నికల కమిషనర్ మార్పు విషయంలో మొదటి నుంచి తాము రాష్ట్రప్రభుత్వ నిరంకుశ వైఖరిని వ్యతిరేకిస్తూనే ఉన్నామన్నారు. రాజ్యాంగ విరుద్దమైన చర్యలకు, నియంతృత్వ పోకడలకు శుక్రవారం నాటి హైకోర్టు తీర్పు చెంపపెట్టుగా అభివర్ణించారు. రాజ్యాంగానికి ఏ స్థాయి వారైనా కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.
'జగన్ నియంతృత్వ పోకడలకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు' - 'జగన్ నియంతృత్వ పోకడలకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు'
వ్యవస్థలను పాడుచేయాలనే ఆలోచనను జగన్ విరమించుకోవాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషనర్ వ్యవహారంలో హైకోర్టు తీర్పును ఆయన స్వాగతించారు.
'జగన్ నియంతృత్వ పోకడలకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు'
ఇకనైనా వైకాపా ప్రభుత్వం నియంతపాలన విడిచిపెట్టి ప్రజల కోసం పనిచేస్తే మంచిదని విష్ణువర్ధన్ రెడ్డి సూచించారు. వ్యవస్థలను పాడుచేయాలనే ఆలోచనను జగన్ విరమించుకోవాలన్నారు. ఎన్నికల కమిషనర్‌గా మరో సారి నియమితులైన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను ఆయన అభినందించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. పార్టీలతో సంబధం లేకుండా రాజ్యాంగ సంస్థలు, వాటి విలువలు చిరస్థాయిగా ఉండాలని అభిప్రాయపడ్డారు.