ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చిరంజీవి భాజపాలోకి వస్తానంటే.. స్వాగతిస్తాం: విష్ణు వర్ధన్ రెడ్డి - టీడీపీపై భాజపా కామెంట్స్

మూడు రాజధానుల విషయంలో కేంద్రానికి సంబంధం లేదని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు. కొన్ని పార్టీలు ఉద్దేశపూర్వకంగానే విమర్శలు చేస్తున్నాయని పేర్కొన్నారు. భాజపాలోకి నేతలు వస్తామంటే.. స్వాగతిస్తామని వ్యాఖ్యానించారు.

bjp vishnu vardhan reddy about amaravathi
bjp vishnu vardhan reddy about amaravathi

By

Published : Aug 8, 2020, 3:37 PM IST

అమరావతి విషయంలో భారతీయ జనతా పార్టీని కావాలనే ముద్దాయి చేయాలని కొన్ని పార్టీలు చూస్తుండడం దురదృష్టకరమని విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం వేరు.. పార్టీ వేరు అని వ్యాఖ్యానించారు. తెదేపా ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు చాలా స్పష్టంగా కేంద్రం సమాధానం చెప్పిందని.. అదే విషయాన్ని హైకోర్టుకు అఫిడవిట్‌ రూపంలో సమర్పించిందన్నారు. అమరావతి రైతుల పక్షాన భాజపా నిలబడతుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు రాయలసీమ ప్రాంతంలో ఒక్క నీటిపారుదల ప్రాజెక్టుకు కూడా టెండర్లు పిలవలేదన్నారు. రాయలసీమలో కృష్ణా ట్రైబ్యునల్‌ ఏర్పాటు అంశంలోనూ రాష్ట్ర ప్రభుత్వం సరిగా స్పందించడం లేదన్నారు. ప్రజాక్షేత్రంలో బలమైన నేతలను భాజపా తప్పకుండా పార్టీలోకి ఆహ్వానిస్తుందని.. కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి భాజపాలోకి వస్తానంటే స్వాగతిస్తామన్నారు.

ఇదీ చదవండి:సీఆర్డీఏపై హైకోర్టు స్టే వెకేట్​ చేయాలని సుప్రీంలో ప్రభుత్వం పిటిషన్‌

ABOUT THE AUTHOR

...view details