భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నియమితులైన సోము వీర్రాజు... మాజీమంత్రి, ప్రముఖ సినీనటుడు చిరంజీవితో భేటి కావటం చర్చకు దారితీసింది. చిరంజీవితో మర్యాదపూర్వకంగా కలిసినట్లు సోము వీర్రాజు ట్విట్టర్లో ప్రకటించారు. అయితే అంతకు ముందు భాజపా మీడియా గ్రూపుల్లో మాత్రం చిరంజీవి వెళ్లి సోము వీర్రాజును కలిశారని... 2024లో భాజపా-జనసేన కూటమి అధికారంలోకి రావాలని మెగాస్టార్ ఆకాంక్షించినట్లు పోస్టు చేశారు. కాసేపటికే దాన్ని తొలగించి... సోము వీర్రాజు వెళ్లి చిరంజీవిని ఆయన నివాసంలో కలిసినట్లు తెలిపారు. ఇది మర్యాదపూర్వకంగా జరిగిందని వివరించారు.
2024లో భాజపా, జనసేన అధికారం చేపట్టాలి: చిరంజీవి - చిరంజీవిని కలిసిన సోమువీర్రాజు న్యూస్
సినీ నటుడు చిరంజీవిని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కలిశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టినందుకు మెగాస్టార్ అభినందనలు తెలిపారు.
bjp state president somuverraju met chiranjeevi
భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన.. సోము వీర్రాజుకు ఈ సందర్భంగా చిరంజీవి అభినందనలు తెలియజేశారు. భాజపా- జనసేన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని... పవన్ కళ్యాణ్ సహకారంతో ముందుకెళ్లాలని చిరంజీవి ఆకాంక్షించినట్లు వీర్రాజు వెల్లడించారు. సోము వీర్రాజుతోపాటు సిని నిర్మాత ఎస్.వి.బాబు కూడా ఉన్నారు.
ఇదీ చదవండి:'అంధాధున్' రీమేక్‌లో నయనతార!
Last Updated : Aug 6, 2020, 8:04 PM IST