SOMU VEERRAJU: అన్నపూర్ణాంధ్రను వైకాపా అప్పుల ఆంధ్రగా మార్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. ఎన్నికలకు ముందు సంపూర్ణ మద్య నిషేధమని చెప్పి.. ఇప్పుడేమో ధరలు విపరీతంగా పెంచి అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవాడి బలహీనతపై డబ్బు సంపాదించడం దారుణమని విజయవాడలో సోము వీర్రాజు మండిపడ్డారు. వైకాపా పాలన అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. మంత్రులు పరిపాలన మీద కాకుండా ప్రతిపక్ష పార్టీలను దూషించడంపై దృష్టి పెట్టారని మండిపడ్డారు. మద్యాన్ని ఏరులై పారిస్తూ పేదల రక్తం తాగుతున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు.
SOMU VEERRAJU: అన్నపూర్ణాంధ్రను.. అప్పుల ఆంధ్రగా మార్చారు: సోము వీర్రాజు - Somuveer Raju latest news
SOMU VEERRAJU: రాష్ట్రంలో వైకాపా పాలన అస్తవ్యస్తంగా మారిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. అన్నపూర్ణాంధ్రగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రగా మార్చేశారని ఆక్షేపించారు.
సోమువీర్రాజు