దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తోన్న వేళ.. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఆయుర్వేద మందుపై శాస్త్రీయ పరిశీలన చేయించాలని కోరుతూ కేంద్ర ఆయుష్ శాఖ ఇన్ఛార్జి మంత్రి కిరణ్ రిజిజుకు సోము వీర్రాజు లేఖ రాశారు. అతి పురాతనమైన ఆయుర్వేద మందుల వినియోగం ద్వారా ఈ వ్యాధి నుంచి బయటపడేందుకున్న అవకాశాలపై సమగ్ర పరిశీలన చేయించాలని కోరారు.
ఆనందయ్య మందుపై శాస్త్రీయ పరిశీలన చేయించాలి.. కేంద్ర ఆయుష్ శాఖకు సోము వీర్రాజు లేఖ - నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు వార్తలు
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఆయుర్వేద మందుపై శాస్త్రీయ పరిశీలన చేయించాలని కోరుతూ.. కేంద్ర ఆయుష్ శాఖ ఇన్ఛార్జి మంత్రి కిరణ్ రిజిజుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. ఈ మందు చాలా మందిలో ఆసక్తి కలిగిస్తోందని లేఖలో చెప్పారు.
bjp state president somu verraju letter to central minister about anandiah medicine
ఆనందయ్య ఆయుర్వేద మందు కోసం ప్రజలు భారీగా వెళ్తుండడం.. ఇప్పటివరకు ఈ మందు వాడకం ద్వారా ప్రజలపై దుష్ప్రభావాలు ఏవీ బయటపడకపోవడం చాలా మందిలో ఆసక్తి కలిగిస్తోందని చెప్పారు. ఆనందయ్య ఆయుర్వేద మందుపై మీడియాలోనూ పలు కథనాలు వస్తున్నాయని అన్నారు. ఐసీఎంఆర్ బృందాలను కృష్ణపట్నం పంపించి ఆనందయ్య మందుపై పరిశీలన చేయించాలని లేఖలో కోరారు.
ఇదీ చదవండి:సోనూసూద్ ఆక్సిజన్ ప్లాంట్లు.. ఆంధ్రా నుంచే శ్రీకారం