ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మత ప్రాతిపదికన వేతనాల పెంపు సరికాదు: సోము వీర్రాజు - అర్చకులు, పాస్టర్లు, ఇమామ్​లకు వేతనాల పెంపుపై సోము వీర్రాజు ఆగ్రహం

దేవాలయాల అర్చకులు, పాస్టర్లు, ఇమామ్​లకు వేతనాల పెంపుపై భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మండిపడ్డారు. ఉపాధి కరవై రోడ్డున పడుతున్న ప్రైపేటు పాఠశాలల ఉపాధ్యాయులకు ఈ మొత్తాన్ని అందిస్తే బాగుంటుందని తెలిపారు. విశాఖ మినహా ఇతర ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడాన్ని విమర్శించారు.

bjp state president somu veerraju fired on govenment
మత ప్రాతిపదికన వేతనాల పెంపును తప్పపట్టిన సోము వీర్రాజు

By

Published : May 5, 2021, 3:18 PM IST

మతాల ప్రాతిపదికన వేతనాల పెంపునకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు విజయవాడలోని పార్టీ కార్యలయంలో తప్పుపట్టారు. మంత్రివర్గ సమావేశంలో ఆలయాల అర్చకులు, పాస్టర్లు, ఇమామ్​లకు వేతనాలు పెంచడాన్ని ఆక్షేపించారు. దేవాదాయశాఖ ద్వారా ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు జీతాలు అందజేస్తున్నారు కానీ ప్రభుత్వం దృష్టిలో పాస్టర్లకు నిర్వచనం ఏమిటి? ఏ ప్రాతిపదికన జీతాలు పెంచి ఇవ్వాలని భావిస్తున్నారో శ్వేతపత్రం విడుదలచేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతితో, ఆక్సిజన్ అందక అనేక మంది మరణిస్తున్న సమయంలో.. మతపెద్దలకు జీతాలు పెంచడమేమిటని ప్రశ్నించారు. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తోన్న ఉపాధ్యాయులు రోడ్డున పడుతుండగా.. అలాంటి వారికి ఈ మొత్తాలను అందించి ఆదుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:'అధికారుల్ని జైల్లో వేస్తే ఆక్సిజన్​ వస్తుందా?'

విశాఖ కేంద్రంగా పర్యాటక అభివృద్ధికి రూ. 1,000 కోట్లు కేటాయించడం సంతోషమేనని.. కానీ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కనీసం రూ. 500 కోట్లను ప్రత్యేకించి వాటిపై శ్రద్ధ చూపలేదని వీర్రాజు విమర్శించారు. పశ్చిమబంగాల్‌లో శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం.. వేల మంది భాజపా కార్యకర్తలు, వారి ఇళ్లు, దుకాణాలపై తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ దాడులకు పాల్పడిందని ఆరోపించారు. అందుకు వ్యతిరేకంగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉదయం 11 గంటల నుంచి 12 వరకు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ నిరసన చేపట్టినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

కర్ఫ్యూ నుంచి.. ఈ రంగాలకు మాత్రమే మినహాయింపు..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details