నెక్లెస్ రోడ్లో సేద తీరుతున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై దుండగులు దాడి చేశారు. భాజపా నేతల కారు అద్దాలు ధ్వంసం చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పలువురిపై రాంగోపాల్‌పేట పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు.
తెలంగాణ: నెక్లెస్‌రోడ్డులో బండి సంజయ్ కారుపై దాడి.. అద్దాలు ధ్వంసం - జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020 న్యూస్
హైదరాబాద్‌లో భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై దుండగులు దాడి చేశారు. భాజపా నేతల కారు అద్దాలు ధ్వంసం చేశారు.
నెక్లెస్‌రోడ్డులో బండి సంజయ్ కారుపై దాడి.. అద్దాలు ధ్వంసం
అంతకుముందు బండి సంజయ్ చిన్నపిల్లలతో కలిసి ఆటలు ఆడారు. ఉదయం నుంచి దేవాలయాల సందర్శన, హోమాల్లో పాల్గొన్న ఆయన... రాత్రి ఎనిమిది గంటల సమయంలో కొద్దిసేపు సేద తీరేందుకు నెక్లెస్ రోడ్‌కు వచ్చారు.