ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సైనికుల త్యాగం వృథా కాదు.. ప్రతీకార చర్య తప్పదు: బండి సంజయ్ - కల్నల్ సంతోష్​బాబు అంత్యక్రియలు

కవ్వింపు చర్యలకు పాల్పడి భారత జవాన్ల ప్రాణాలను బలి తీసుకున్న చైనా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. సూర్యాపేటలోని కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహాన్ని ఆయన సందర్శించారు.

Bjp state president bandi sanjay Paying tribute to colnel santosh babu
Bjp state president bandi sanjay Paying tribute to colnel santosh babu

By

Published : Jun 18, 2020, 12:37 PM IST

సైనికుల త్యాగం వృథా కాదు.. ప్రతీకార చర్య తప్పదు: బండి సంజయ్

దేశరక్షణ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన కల్నల్ సంతోష్​బాబు నేటి తరానికి స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తారని బండి సంజయ్ అన్నారు. కల్నల్ సంతోష్​బాబు పార్థివ దేహానికి ఆయనతో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాళులర్పించారు.

ఘర్షణ వాతావరణం వద్దంటూనే చైనా కవ్వింపు చర్యలకు పాల్పపడిందని బండి సంజయ్ మండిపడ్డారు. కల్నల్ సంతోష్​బాబు పోరాటయోధుడని కొనియాడారు. ఈఘటనకు ప్రతికార చర్య తప్పదన్నారు. దేశం కోసం ప్రాణాలు విడిచిన సైనికుల త్యాగాలు వృథాకావని చెప్పారు. కల్నల్ సంతోష్​బాబు దేశం కోసం ప్రాణాలు కోల్పోడం పట్ల ఆయన తల్లిదండ్రులు గర్వంగా ఉన్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు.

" దేశం కోసం ప్రాణాలు విడిచిన సైనికుల త్యాగాలు వృథా కావు. కవ్వింపు చర్యలకు పాల్పడి జవాన్ల ప్రాణాలను బలి తీసుకున్న చైనా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కల్నల్ సంతోష్​బాబు నేటి తరానికి స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తారు."

--- బండి సంజయ్, భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు

-

ఇవీ చూడండి:

తెలంగాణ: అమరుడు కల్నల్ సంతోష్​బాబు అంతిమ యాత్ర ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details