ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 15, 2021, 10:51 PM IST

ETV Bharat / city

ఎంపీనే ఈ విధంగా వేధిస్తే... సామాన్యుల పరిస్థితి ఏంటీ? : సోము వీర్రాజు

రాజకీయ కక్షతోనే ఎంపీ రఘురామకృష్ణరాజు విషయంలో ప్రభుత్వం క్రూరంగా ప్రవర్తించిందని.. భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆరోపించారు. ఓ పార్లమెంటు సభ్యుడినే పోలీసులు ఇలా వేధిస్తే.. సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

bjp ap chief somu veerraju
భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు

రాష్ట్ర పోలీసుల కస్టడీలో తీవ్రంగా గాయపడిన ఎంపీ రఘురామకృష్ణరాజు చిత్రాలు బాధ కలిగించాయని.. భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తెలిపారు. ఇది కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే అని తేల్చిచెప్పారు. ఓ పార్లమెంటు సభ్యుడినే ఈ విధంగా పోలీసులు వేధిస్తే.. సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ దారుణానికి కారణమైన అధికారులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:'జులై నాటికి 51.6కోట్ల టీకా డోసుల పంపిణీ'

ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయడం, రాజకీయ ఎజెండాను నేరవేర్చుకోవడానికి క్రూరంగా ప్రవర్తించడం అప్రజాస్వామికమని వీర్రాజు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తన ప్రతీకార చర్యలను ఆపి.. ఎంపీపై రాజకీయంగా ప్రేరేపించిన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని హితవు పలికారు. న్యాయస్థానాల ద్వారా త్వరలోనే ఆయనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి:

'ముసుగులు ధరించి.. తాళ్లతో కట్టేసి కొట్టినట్లు రఘురామ చెప్పారు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details