ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రథం దగ్ధం ఘటనలో వాస్తవాలు కప్పిపుచ్చుతున్నారు' - జగన్​పై భాజపా నేత వామరాజు కామెంట్స్

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో జరిగిన రథం దగ్ధం ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని భాజపా డిమాండ్ చేసింది. అధికారులు వాస్తవాలను కప్పిపుచ్చుతున్నారని, విద్యుదాఘాతం వల్ల జరిగిందని అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు.

bjp satya murthi on antharvedhi chariot fire
bjp satya murthi on antharvedhi chariot fire

By

Published : Sep 7, 2020, 7:54 PM IST

మతి స్థిమితం లేని వ్యక్తులు చేశారనే ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని భాజపా నేత వామరాజు సత్యమూర్తి విమర్శించారు. గతంలోనూ పిఠాపురంలో విగ్రహాలు ధ్వంసం చేయడం, నెల్లూరులో రథం దగ్ధం, నిడదవోలులో బలవంతంగా మతమార్పిడి చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఫిర్యాదుదారుడిపైనే కేసు నమోదు చేసి కొట్టడం వంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ తరహా సంఘటనలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ప్రజల మనో భావాలు దెబ్బతినే విధంగా వ్యవహరిస్తే భాజపా తరఫున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details