JP Nadda Visit to Hyderabad: భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 4వ తేదీన హైదరాబాద్ నగరానికి రానున్నారు. నడ్డాకు ఘనస్వాగతం పలికేందుకు భాజపా రాష్ట్ర శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు భాజపా రాష్ట్ర కార్యాలయంలో వివిధ జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. నగర శివారులోని అన్నోజిగూడలో ఈ నెల 5, 6, 7 తేదీల్లో జరిగే ఆర్‌ఎస్‌ఎస్ సమావేశాల్లో నడ్డా పాల్గొననున్నారు.
JP Nadda Visit to Hyderabad: హైదరాబాద్కు జేపీ నడ్డా.. ఎప్పుడంటే? - భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
JP Nadda Visit to Hyderabad: భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఈ నెల 4న నగరానికి రానున్న నడ్డా.. మూడు రోజులపాటు జరగనున్న ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
హైదరాబాద్కు జేపీ నడ్డా