BJP Deeksha on PRC : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనలకు సంఘీభావంగా భాజపా రాష్ట్రశాఖ ఒకరోజు నిరసనదీక్షకు పిలుపునిచ్చింది. నేడు విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆధ్వర్యంలో ఈ దీక్ష జరగనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు శాపంగా చీకటి జీవో మారిందని...వెంటనే ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని భాజపా డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు నూతనంగా తీసుకొచ్చిన పీఆర్‌సీ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని పేర్కొంది. ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ నిరసదీక్ష చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ దీక్షలో సోము వీర్రాజుతో పాటుగా ఎంపీలు సీఎం రమేష్, జీవీయల్ నరసింహారావు, ఎమ్మెల్సీలు పీవీయన్ మాధవ్, వాకాటి నారాయణరెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తదితరులు పాల్గొననున్నారు.
BJP Deeksha on PRC : పీఆర్సీపై భాజపా ఒక్కరోజు దీక్ష - bjp protest
BJP Deeksha on PRC : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనలకు సంఘీభావంగా భాజపా రాష్ట్రశాఖ ఒకరోజు నిరసనదీక్షకు పిలుపునిచ్చింది. నేడు విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆధ్వర్యంలో ఈ దీక్ష జరగనుంది.
పీఆర్సీపై భాజపా ఒక్కరోజు దీక్ష