ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భాజపా - జనసేన పొత్తుపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు

భాజపా - జనసేన పొత్తుపై భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. మిత్రపక్షాలుగా ఉన్న భాజపా, జనసేన కార్యక్రమాలు వేరైనా.. పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో భాజపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా పాల్గొని.. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.

Daggubati Purandeswari
Daggubati Purandeswari

By

Published : Apr 6, 2022, 5:43 PM IST

జనసేన పార్టీతో పొత్తు విషయంపై భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మిత్రపక్షాలుగా ఉన్న భాజపా, జనసేన కార్యక్రమాలు వేరైనా.. పొత్తు కొనసాగుతుందని తెలిపారు. మిత్రపక్షంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తమ పార్టీ నేతలతో ఏ విషమైనా చర్చించవచ్చని... వాటిపై స్పందిస్తామని స్పష్టం చేశారు.

విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో భాజపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని.. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశ సేవకి ప్రతి భాజపా కార్యకర్త పునరంకితం కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో నాలుగు రాష్ట్రాల్లో ప్రజలు భాజపాకి పట్టం కట్టారని... ఉత్తరప్రదేశ్​లో రెండోసారి అధికారం ఇవ్వటం.. భాజపా పాలనపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. మోదీ ప్రధానిగా ఎనిమిదేళ్ల కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని వివరించారు.

ఇదీ చదవండి:ప్రభుత్వానికి ఆదాయార్జన ఎంత కష్టమో అందరికీ తెలుసు: మంత్రి బుగ్గన

ABOUT THE AUTHOR

...view details