ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రఘురామపై జరిగిన దాడి బాధించింది : భాజపా ఎంపీ సంజయ్ జైస్వాల్ - bjp mp sanjay jaiswal

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఏపీ సీఐడీ అధికారులు.. ప్రవర్తించిన తీరును భాజపా ఎంపీ సంజయ్ జైస్వాల్ ఖండించారు. ఈ ఘటనపై పార్లమెంట్​లో ప్రస్తావిస్తానన్నారు.

BJP mp sanjay jaiswal fire on mp raguramakrishnaraju
భాజపా ఎంపీ సంజయ్ జైస్వాల్

By

Published : Jun 7, 2021, 9:40 PM IST

ఏపీ సీఐడీ అధికారులు త‌న‌ను చిత్ర‌హింస‌ల‌కు గురి చేశారంటూ ఎంపీ ర‌ఘురామకృష్ణ‌రాజు స‌హ‌చ‌ర ఎంపీల‌కు రాసిన లేఖ‌ ప‌ట్ల ఆయ‌న‌కు మ‌ద్ద‌తు పెరుగుతోంది. భాజ‌పా ఎంపీ, నీటి పారుద‌ల వ్య‌వ‌హారాల స్థాయి సంఘం ఛైర్మ‌న్ సంజ‌య్ జైస్వాల్.. ర‌ఘురామ లేఖ‌పై స్పందించారు. ఎంపీపై దాడి త‌న‌ను బాధించింద‌ని వివ‌రించారు. ఘ‌ట‌న‌పై పార్ల‌మెంట్‌లో ప్ర‌స్తావిస్తాన‌న్నారు. ఈ విష‌యాన్ని మెయిల్ ద్వారా సంజ‌య్ జైస్వాల్ ర‌ఘురామ‌కు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details