ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే.. తెలంగాణతో చర్చించాలా?: జీవీఎల్ - BJP MP GVL ON STATE BIRURCATION PENDING ISSUES

ఈ నెల 17న విభజన సమస్యల పరిష్కారం కోసం జరిగే సమావేశం అజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర హోంశాఖ ప్రస్తావించడంపై.. భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ట్విట్టర్‌లో స్పందించారు. వైకాపా ఎంపీలు ఏదో సాధించారని టీవీల్లో విని చాలా సంతోషించానన్న జీవీఎల్.. కేంద్ర హోంశాఖ నోట్‌పై తాను ఆరా తీశానని తెలిపారు. ప్రత్యేక హోదా అంశం రెండురాష్ట్రాల కమిటీ అజెండాలో ఉండేది కాదని తెలిసిందని పేర్కొన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే తెలంగాణతో చర్చించాలా
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే తెలంగాణతో చర్చించాలా

By

Published : Feb 12, 2022, 5:52 PM IST

విభజన సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17న జరిగే సమావేశం అజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర హోంశాఖ ప్రస్తావించడంపై.. భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ట్విట్టర్‌లో స్పందించారు. వైకాపా ఎంపీలు ఏదో సాధించారని టీవీల్లో విని చాలా సంతోషించానన్న జీవీఎల్ కేంద్ర హోంశాఖ నోట్‌పై తాను ఆరా తీశానని అన్నారు.

ప్రత్యేక హోదా అంశం రెండురాష్ట్రాల కమిటీ అజెండాలో ఉండేది కాదని తెలిసిందని పేర్కొన్నారు. మనకు ప్రత్యేక హోదా ఇవ్వాలంటే తెలంగాణతో చర్చించాలా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. 'కేంద్ర హోంశాఖ నోట్‌ను నేను చూశాను, నేను మాట్లాడాను, ఆ తర్వాతే వివరణ ఇచ్చాను' అని జీవీఎల్ స్పష్టం చేశారు.

ఈనెల 17న విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ సమావేశం..
ఆంధ్రప్రదేశ్ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం.. తెలుగురాష్ట్రాల మధ్య ఉమ్మడి ఆస్తుల పంపకాలపై తలెత్తిన వివాదాల పరిష్కారం దిశగా కేంద్రం కీలక అడుగు వేసింది. విభజన చట్టంలోని షెడ్యూల్‌ 9, 10లోని సంస్థల విభజన సహా ఇతర అపరిష్కృత అంశాలపై.. ఈనెల 8నే త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం.. ఈనెల 17న మొదటి సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరిగే సమావేశానికి.. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్‌కుమార్‌ నేతృత్వం వహించనుండగా.. ఏపీ నుంచి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌, తెలంగాణ నుంచి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొంటారు. సమావేశంలో మొత్తం 9 అంశాలపై చర్చించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం.. ఇరురాష్ట్రాలకు అజెండా ప్రతిని పంపింది.

సమావేశంలో చర్చించే ప్రధాన అంశాలు..

1. ఏపీ ఫైనాన్స్‌ కొర్పొరేషన్‌ విభజన

2. విద్యుత్ వినియోగ అంశాలు

3. పన్ను అంశాల్లో సవరణలు

4. ఏపీఎస్‌సీఎస్‌సీఎల్‌, టీఎస్‌సీఎస్‌సీఎల్‌ సంస్థలో నగదు అంశం

5. వనరుల సర్దుబాటు

6. 7 వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధి నిధుల అంశం

7. ప్రత్యేక హోదా

8. పన్ను ప్రోత్సాహకాలు

9. వనరుల వ్యత్యాసం

ఇదీ చదవండి

మూడు చోట్ల రాజధానులు పెడితే.. ఎక్కడకు రావాలి: కేంద్రమంత్రి అఠావలే

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details