గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను భాజపా ఎంపీ జీవీఎల్‌నరసింహారావు కలిశారు. రాష్ట్రంలో ఘర్షణ పూరిత వాతావరణం నెలకొందని.. పాలక, ప్రతిపక్ష పార్టీలు ఘర్షణ వైఖరిని అవలంబిస్తున్నాయని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ పరిస్థితులు శాంతిభద్రతలకు ప్రమాదమని వ్యాఖ్యానించారు. ఆయా పార్టీలు ఇప్పుడు వ్యాఖ్యలు దాటి.. పర్యటనలను అడ్డుకోవడం వరకు వచ్చాయని చెప్పారు.
రాష్ట్రంలో ఘర్షణ పూరిత వాతావరణం: గవర్నర్‌తో జీవీఎల్ - ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసిన భాజపా ఎంపీ జీవీఎల్
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గవర్నర్ బిశ్వభూషణ్‌కు వివరించినట్లు భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. పాలక, ప్రతిపక్ష పార్టీలు ఘర్షణ పూరిత వైఖరిని అవలంబిస్తున్నాయని గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు.
గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసిన జీవీఎల్