ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

GVL: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలకు తీవ్రంగా అన్యాయం చేస్తోంది: భాజపా ఎంపీ జీవీఎల్ - భాజపా ఎంపీ జీవీఎల్ తాజా వార్తలు

ఎస్సీల అభివృద్ధికి కేంద్రం అమలు చేస్తున్న అనేక పథకాల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లిస్తోందని భాజపా ఎంపీ జీవీఎల్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలకు తీవ్రంగా అన్యాయం చేస్తోందని.. ఆయన మండిపడ్డారు.

భాజపా ఎంపీ జీవీఎల్
భాజపా ఎంపీ జీవీఎల్

By

Published : Feb 22, 2022, 5:24 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలకు తీవ్రంగా అన్యాయం చేస్తోందని.. భాజపా ఎంపీ జీవీఎల్​ నరసింహారావు విమర్శించారు. ఎస్సీల అభివృద్ధికి కేంద్రం అమలు చేస్తున్న అనేక పథకాల నిధులను దారిమళ్లిస్తోందని ఆరోపించారు. ఎస్సీ విద్యార్థుల ఉన్నత చదువులు, విదేశీ విద్య, ఉపాధి కోసం ఇచ్చే నిధులను సొంత పథకాలకు మళ్లించి గొప్పలు చెప్పుకొంటోందని మండిపడ్డారు. గతంలో 6 లక్షల 70 వేల విద్యార్థులు స్కాలర్​షిప్​లు పొందేవారని.., వైకాపా ప్రభుత్వం 3 లక్షల 60 వేల మంది విద్యార్థులకు మాత్రమే ఉపకార వేతనాలు అందిస్తోందని మండిపడ్డారు.

పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని మార్చాలి అంటున్నారని..,ఆ మాటలు అవమానించే విధంగా ఉన్నాయని దుయ్యబట్టారు. అన్యమతాలు షెడ్యూల్ కులాల కిందకురారన్న జీవీఎల్.., రాష్ట్రంలో మతమార్పిడిలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎస్సీ వర్గంలో ఉన్నవారు మాత్రమే.. రాజ్యాంగబద్ధంగా సబ్​ప్లాన్ నిధులకు అర్హులని జీవీఎల్ స్పష్టం చేశారు.

ఎస్సీ మోర్చా ఆధ్వర్యాన విజయవాడలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో.. గుండెపోటుతో మృతి చెందిన మంత్రి గౌతమ్‌రెడ్డి చిత్రపటానికి నేతలు నివాళులు అర్పించారు. అలాగే ఇటీవల హత్యకు గురైన భాజపా కిసాన్ మోర్చా నాయకుడు మల్లారెడ్డికి అంజలి ఘటించారు.

ఇదీ చదవండి

RRR: ఇంటింటికీ రేషన్‌తో ఏటా రూ. 6 వేల కోట్లు దుబారా: ఎంపీ రఘురామ

ABOUT THE AUTHOR

...view details