విజయవాడ నగరానికి చెందిన పేద బ్రాహ్మణులకు నిత్యవసర సరకులను విజయవాడ నగర విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.
భాజపా ఎంపీ గోకరాజు లైలా గంగరాజు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. లాక్డౌన్ కారణంగా తమ ఉపాధి కోల్పోయిన బ్రాహ్మణులకు విశ్వహిందూ పరిషత్ అండగా ఉందని నిర్వాహకులు తెలిపారు.