ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక మోసాలపై కేంద్ర ఆర్థికమంత్రికి ఫిర్యాదు చేస్తాం'

ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తయారు చేయాలనే కృతనిశ్చయంతో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఉందని భాజపా నేత పి.వి.ఎన్ మాధవ్ ఆరోపించారు. ఆర్ధిక విషయాల్లో కేంద్ర ప్రభుత్వ నిబంధనలను తుంగలోకి తొక్కిందని మార్గదర్శకాలను అతిక్రమించి ఒక పెద్ద ఆర్ధిక దోపిడీకి తెర తీసిందన్నారు. ప్రపంచ ప్రసిద్ధి ఇంద్రజాలకులు ఎవరూ చేయని గారడీ రాష్ట్రంలో జరుగుతోందని ఆర్ధికమంత్రి బుగ్గన ఆధ్వర్యంలో రెండేళ్లుగా మేజిక్‌ చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఎమ్మెల్సీ
ఎమ్మెల్సీ

By

Published : Aug 2, 2021, 4:53 PM IST

Updated : Aug 2, 2021, 5:02 PM IST

ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తయారు చేయాలనే కృతనిశ్చయంతో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఉందని.. శాసనమండలి సభ్యుడు, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.వి.ఎన్‌.మాధవ్‌ ఆరోపించారు. గత రెండేళ్లుగా ఆర్ధిక క్రమశిక్షణ పాటించకపోవడమే కాకుండా.. ఎక్కడా ఎవరూ చేయని రీతిలో ఆర్ధిక తప్పిదాలు చేస్తూ పలు ఆర్ధిక నేరాలకు పాల్పడుతోందని ఆయన విజయవాడలో విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా, ప్రజలను మోసం చేసేలా ఆర్ధిక పరిస్థితికి తూట్లు పొడుస్తోందని దుయ్యబట్టారు. ఆర్ధిక విషయాల్లో కేంద్ర ప్రభుత్వ నిబంధనలను తుంగలోకి తొక్కిందని.. మార్గదర్శకాలను అతిక్రమించి ఒక పెద్ద ఆర్ధిక దోపిడీకి తెరతీసిందన్నారు. ప్రపంచ ప్రసిద్ధి ఇంద్రజాలకులు ఎవరూ చేయని గారడీ రాష్ట్రంలో జరుగుతోందని.. ఆర్ధికమంత్రి బుగ్గన ఆధ్వర్యంలో రెండేళ్లుగా మేజిక్‌ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదాయం లేని రాష్ట్రానికి అప్పులు ఎలా వస్తున్నాయని? ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక మోసాలు, నేరాలపై తాము ఒక బృందంగా ఆర్‌బీఐ, కేంద్ర ఆర్ధికమంత్రికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

ఎమ్మెల్సీ మాధవ్ ప్రెస్ మీట్

రాబోయే కాలంలో ఎక్సైజ్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని ముందుగా అంచనా వేసి.. బ్యాంకుల నుంచి 13 వేల 5 వందల కోట్ల రూపాయలను ఎలా ముందస్తుగా తీసుకుంటారని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీలకు నిర్దేశించిన జాతీయ కార్పొరేషన్ల నిధులను దారిమళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారని.. ఎస్సీ, ఎస్టీలకు ఉపకారవేతనాలు, ఫించన్ల రూపంలో రావాల్సిన రూ.4100 కోట్లు విద్యాదీవెన, చేయూత వంటి కార్యక్రమాలకు దారి మళ్లించారన్నారు.

సెంట్రల్‌ రోడ్‌ ఫండ్‌తోపాటు ఇతర కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల కార్యక్రమాలకు వినియోగిస్తోందన్నారు. అప్పులు చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలనే ప్రయత్నం చేస్తూ.. కేంద్ర ప్రభుత్వ నిధులను పీడీ అకౌంట్లు ప్రారంభించి వాటికి మళ్లించి ఆయా నిధులతో చేయాల్సిన కార్యక్రమాలు కాకుండా కొత్త పథకాలు కొత్త కార్యక్రమాలకు తరలిస్తోందన్నారు.

ఇదీ చదవండి:

Olympics Live: క్వార్టర్స్​లో భారత మహిళల హాకీ జట్టు విజయం..

Last Updated : Aug 2, 2021, 5:02 PM IST

ABOUT THE AUTHOR

...view details