BJP MLC MADHAV : రాష్ట్రాన్ని 6 లక్షల కోట్లకు పైగా అప్పుల్లో ముంచిన ఘనత ముఖ్యమంత్రి జగన్కు దక్కుతుందని భాజపా ఎమ్మెల్సీ మాధవ్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఖరితో కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయని ఆవేదన చెందారు. విజయవాడలోని భాజపా కార్యాలయంలో మాట్లాడిన మాధవ్.. సినిమా రంగంలో ప్రభుత్వం అనవసరంగా జోక్యం చేసుకుంటోందన్నారు. సినిమా రంగంపై దాడులు చేయిస్తున్నారా? అని ప్రశ్నించిన మాధవ్.. కొన్ని థియేటర్లను మాత్రమే ప్రభుత్వం ఎందుకు టార్గెట్ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ నిలదీశారు.
BJP MLC MADHAV : 'ఏపీ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన.. వైకాపా సర్కారు' - vijayawada
BJP MLC MADHAV :ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను వైకాపా సర్కారు దెబ్బతీసిందని.. భాజపా ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ప్రభుత్వ పాలనా తీరును ప్రశ్నించేందుకు ఈనెల 28న "ప్రజాగ్రహ సభ" నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రకాశ్ జావడేకర్ హాజరవుతారని వెల్లడించారు.
భాజపా ఎమ్మెల్సీ మాధవ్
వికేంద్రీకరణ పేరుతో ఏకీకృత వ్యవస్థను అమలు చేసి, జె-టాక్స్ అమలు చేయాలని చూస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఈ నెల 28న 'ప్రజాగ్రహ సభ' నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జావడేకర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని స్పష్టం చేశారు.
ఇదీచదవండి :