ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలవరాన్ని మేమే పూర్తిచేస్తాం: ఎమ్మెల్సీ మాధవ్ - ఎమ్మెల్సీ మాధవ్ తాజా వార్తలు

జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని తామే పూర్తిచేస్తామని భాజపా రాష్ట్ర కార్యదర్శి మాధవ్ స్పష్టంచేశారు. తెదేపా, వైకాపా రెండూ తమ స్వప్రయోజనాలు కోసం పోలవరాన్ని వాడుకుంటున్నాయని విమర్శించారు. వాస్తవిక అంచనాలకు అనుగుణంగా చేయాలనేది తమ పార్టీ ఉద్దేశమని చెప్పారు.

madhav, mlc
మాధవ్, ఎమ్మెల్సీ

By

Published : Oct 25, 2020, 12:43 PM IST

జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని పూర్తి చేస్తామని.. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. వాస్తవిక అంచనాలకు అనుగుణంగా చేయాలనేది తమ పార్టీ ఉద్దేశమని ఆయన అన్నారు. గత ప్రభుత్వం సాంకేతిక పేరిట అంచనాలు పెంచిందన్నారు. పోలవరంలో అవినీతి జరిగిందని తాము నమ్ముతున్నామని.. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ చేసి వారు అనుకున్న గుత్తేదారునికి పనులు అప్పగించడం తప్ప ఏ గొప్ప పనీ జరగలేదన్నారు. పోలవరం విషయంలో పారదర్శకత పెంచాలన్నారు.

తెదేపా, వైకాపా రెండూ తమ స్వార్ధరాజకీయం కోసం పోలవరం ప్రాజెక్టును ఉపయోగించుకోవాలని చూస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమైన చోట రాష్ట్ర ప్రభుత్వం ఒకే విధమైన విధానం అనుసరించాలన్నారు. అక్రమ కట్టడాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో కాకుండా స్పస్టమైన వైఖరి అమలు చేయాలని మాధవ్‌ కోరారు.

ABOUT THE AUTHOR

...view details