ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భాజపా పదాధికారుల సమావేశం.. తిరుపతి ఉప ఎన్నికపై చర్చ

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ పరిణామాలతో పాటు తిరుపతి ఉప ఎన్నిక అంశాలే ప్రధాన ఎజెండాగా.. విజయవాడలో భాజపా రాష్ట్ర పదాధికారుల సమావేశం జరుగుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, రాష్ట్ర వ్యవహారాల సహ ఇంఛార్జి సునీల్‌ దియోధర్‌ ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ సమావేశానికి అన్ని జిల్లాల అధ్యక్షులు, ముఖ్యనేతలు హాజరయ్యారు.

bjp meeting on tirupathi by elections
bjp meeting on tirupathi by elections

By

Published : Mar 13, 2021, 12:31 PM IST

Updated : Mar 13, 2021, 2:55 PM IST

విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో భాజపా పదాధికారులు సమావేశమయ్యారు. పార్టీ ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించిన పరిణామాలు, తిరుపతి ఉపఎన్నికలే ప్రధాన ఎజెండాగా చర్చ జరుగుతోంది. తిరుపతి అభ్యర్థి అంశంలో పార్టీ పెద్దలు అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. విశ్రాంత కేంద్ర సర్వీసు అధికారిని పోటీలో నిలిపే అంశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

ఉప ఎన్నికపై ప్రకటన వచ్చాక అభ్యర్థిని ప్రకటిస్తామని భాజపా నేత సునీల్‌ దియోధర్‌ తెలిపారు. విశాఖ ఉక్కు విషయంలో ఉద్యోగుల బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. దేశవ్యాప్త విధానంలో భాగంగానే ప్రైవేటీకరణ జరిగిందన్నారు. తిరుపతి ఉపఎన్నికలో భాజపా గెలుపుపై ధీమాగా ఉన్నామని ఎమ్మెల్సీ మాధవ్‌ అన్నారు. రాష్ట్రంలో భాజపా-జనసేన కూటమి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని చెప్పారు. దేశ వ్యాప్త విధానంలో భాగంగానే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తున్నట్లు పునరుద్ఘాటించారు.

భాజపా పదాధికారుల సమావేశం
Last Updated : Mar 13, 2021, 2:55 PM IST

ABOUT THE AUTHOR

...view details