ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భాజపా రాష్ట్ర కార్యాలయంలో.. కవి భక్తరవిదాస్ జయంతి - భాజపా సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్

ప్రముఖ కవి భక్త రవిదాస్.. బాల్యంలోనే అవమానకర, దుర్భర జీవితాన్ని గడిపారని భాజపా నాయకులు అన్నారు. ఎన్ని అవమానాలు ఎదురైనా తట్టుకుని నిలబడిన వ్యక్తి అని చెప్పారు. ఆయన జయంతిని పురస్కరించుకుని విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో పూల మాలలు వేసి నివాళులర్పించారు.

bjp leaders tributes to bhaktha ravidas
భక్త రవి దాస్

By

Published : Feb 28, 2021, 8:20 AM IST

16వ శతకానికి చెందిన సుప్రసిద్ధ కవి, సంగీత గంధర్వుడు, ప్రముఖ రామ భక్తుడు, స్వామి భక్త రవి దాస్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర భాజపా కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. భక్త రవి దాస్ చిన్నతనంలోనే అవమానకర, దుర్భర జీవితాన్ని గడిపారని నేతలు గుర్తు చేసుకున్నారు.

ఆయన్ను ఆలయ ప్రాంగణంలోకి కూడా అనుమతించే వారు కాదని.. అయినా భక్త రవి దాస్ ఎప్పుడూ నిరాశ పడలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్, కోశాధికారి వామరాజు సత్యమూర్తి, బిట్ర శివన్నారాయణ, పాలూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details